తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: లా వర్సిటీకి రూ.1,000కోట్లు.. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే ‘ఈబీసీ నేస్తం’

అభివృద్ధి వీకేంద్రీకరణే ప్రభుత్వ ఉద్ధేశమని, కర్నూలులోనే హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. గురువారం కర్నూల్ జిల్లాలో నేషనల్‌ లా యూనివర్సిటీకి భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం అడుగులేస్తున్నామని, ఇందులో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటీ దోహదపడుతుందన్నారు. అదేవిధంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, హైకోర్టు భవనాలు నిర్మిస్తామని, లా వర్సిటీ కోసం వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. అనంతరం బనగానపల్లెకు బయలుదేరారు.

ALSO READ: రెండో అతిపెద్ద యూనివర్సిటీ..నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కర్నూల్!

పేదరికానికి కులం ఉండదు

పేదరికానికి కులం ఉండదని సీఎం జగన్ అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె సభావేదిక వద్ద ఈబీసీ నేస్తం ఫొటో గ్యాలరీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ఈబీసీ.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమం కాదని, పేదలను ఆదుకునేందుకు పాలకులకు గొప్ప మనసు, పేదవాళ్లను ఆదుకునే గుణం ప్రభుత్వానికి ఉండాలన్నారు. పేదరికంతో ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఈ పథకం తీసుకొచ్చామని, దీంతో పేద మహిళలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ పథకంతో ఆర్థికంగా వెనుకబడిన ఓబీసీలను ఆదుకున్నామన్నారు. అయితే లబ్ధిదారులు ఏ పార్టీకి ఓటేశారో అని కూడా మేం చూడలేదని, అర్హులైన అన్ని వర్గాల వారికి పథకాలు అందజేస్తున్నామన్నారు.

ALSO READ: ఉత్కంఠకు తెర.. ఎల్లుండే లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్?

రూ. 629.37 కోట్లు జమ..

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 4,19,583 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ. 629.37 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. మొత్తంగా మూడు దఫాల్లో 4 లక్షల 95 వేల మందికి మంచి జరిగిందన్నారు. వైఎస్సార్‌ ఈబీసీ పథకం ద్వారా రూ.1,877 కోట్లు మాత్రమే మంచి చేయగలిగామని, కొత్తగా 65 వేల మంది ఈ సాయం అందుకుంటున్నారని చెప్పారు. ఈ పథకంతో అందరికి మంచి జరగాలని కోరుతున్నాను అని చెప్పారు. అనంతరం బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. అంతకుముందు బనగానపల్లె సభావేదిక వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button