తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: పచ్చి మోసగాళ్లు, దగాకోరులతో యుద్ధం.. సీఎం జగన్

ప్రజలను మోసం చేసే పచ్చి మోసగాళ్లు, దగాకోరులతో యుద్ధం జరుగుతోందని సీఎం జగన్ ప్రతిపక్షాలపై మండిపడ్డాడు. బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా చంద్రబాబు కూటమిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. పేదలను మోసం చేసేందుకు మళ్లీ వస్తున్నారని, ప్రజలంతా అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు. కానీ మీ బిడ్డకు మోసం చేయడం చేతకాదు. అబద్ధాలు చెప్పడం చేతకాదు. రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు, మోసాలు ఇంకా ఎక్కువ వింటామని చెప్పారు.

ALSO READ: లా వర్సిటీకి రూ.1,000కోట్లు.. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే ‘ఈబీసీ నేస్తం’

చంద్రబాబు వంచన.. పవన్ మ్యారేజీ స్టార్

చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ కల్యాన్ పేర్లు చెబితే గుర్తొచ్చేది బాబు చేసిన వంచనలు, పవన్ ఏడుళ్లకోసారి కార్లు మార్చినట్లుగా భార్యలను మార్చే ఒక మ్యారేజీ స్టార్, ఓ వంచకుడు గుర్తుకొస్తారని సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుందని, దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రస్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడన్నారు. ఒకరికి విశ్వసనీయత లేదు. మరొకరికి విలువలు లేవు. మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీద యుద్ధానికి వస్తున్నారని ప్రజలను అలర్ట్ చేశారు.

ALSO READ: రెండో అతిపెద్ద యూనివర్సిటీ..నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కర్నూల్!

హామీలు ఏమయ్యాయి..

2014లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు బీజేపీతో కలిసి ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలు.. మళ్లీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని జగన్ అన్నారు. గతంలో రైతులకు రుణ మాఫీ, పొదుపు సంఘాల రుణాలు 14,205 కోట్లు మాఫీ పేర్లతో మోసం చేశాడన్నారు. ఇదీ కాకుండా విజయవాడలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారని విరుచుకుపడ్డాడు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ రూ.2 వేల నిరుద్యోగభృతి ఏమయ్యాయని నిలదీయాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన 9 హామీలను గుర్తుచేశారు. వీటిలో ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా? అని అడిగారు. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

2 Comments

  1. జై జగన్ అన్న జై గ్రంథి శ్రీనివాస్ గారు జై ఊమా బాల.ప్రజా సేవకుడు తో పోటీ పడలేక పారి పోయిన జనసేన నాయకుడు.కులం మతం చూడని నాయకుడు మన జగన్ అన్న గ్రంధి శ్రీనివాస్ గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button