తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: రెండో అతిపెద్ద యూనివర్సిటీ..నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కర్నూల్!

సీఎం వైఎస్‌ జగన్‌ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టుపై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఇది పూర్తయితే రెండో అతిపెద్ద యూనివర్సిటీగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కర్నూల్ నిలువనుంది. అనంతరం బనగానపల్లెలో రూ. 22కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ALSO READ: గెలుపే లక్ష్యంగా వైసీపీ ‘సిద్ధం’.. ఫైనల్ లిస్ట్ రెడీ!

ఖాతాల్లో రూ.15వేలు జమ..

నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్‌ ‘ఈబీసీ నేస్తం’ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు లబ్ధిదారులకు నగదును బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో రూ.15,000 జమ చేయనున్నారు. మొత్తం 4,19,583 మంది ఖాతాల్లో రూ. 629.37 కోట్లు జమ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం ముగిశాక మధ్యాహ్నం ఓర్వకల్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుని అక్కడినుంచి గన్నవరం బయలుదేరనున్నారు. కాగా, ప్రజాప్రతినిధులతో ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోల్సే కారణమా?

20 ఎకరాల్లో పైలట్ శిక్షణా కేంద్రం!

పైలెట్ శిక్షణకు సంబంధించి ఓర్వకల్ ఎయిర్పోర్ట్ సమీపంలో 20 ఎకరాల్లో పైలట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇప్పటికే శిక్షణా కేంద్రానికి సంబంధించి కర్నూలు విమానాశ్రయంలో పైలెట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు నిర్వహణ కోసం రూ.25కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లా ఒక ఎడ్యుకేషనల్ హబ్‌గా మారి విద్యార్థులకు ఎంతో విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button