తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP: టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోల్సే కారణమా?

వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను తెనాలికి చెందిన గొల్తి గీతాంజలి సంతోషంగా తన అభిప్రాయాన్ని చెప్పడమే పాపమైపోయింది. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పాలనకు ప్రజలు విశేషంగా ఆకర్షితు­లవుతుంటే టీడీపీ, జనసేన కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన కార్యకర్తలు గీతాంజలిపై సోషల్‌ మీడియాలో వికృతంగా ట్రోల్‌ చేసి ఆమె బలవన్మరణానికి కారకులయ్యారు. లబ్ధి కలగడంతో ఆనందపడడమే ఆమె చేసిన తప్పా? గీతాంజలి మరణం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ: గెలుపే లక్ష్యంగా వైసీపీ ‘సిద్ధం’.. ఫైనల్ లిస్ట్ రెడీ!

అణచివేయాలనే పెద్ద కుట్ర..

ప్రభుత్వం పథకాలతో మేలు జరిగిందని చెప్పిన లబ్ధిదారులు భయబ్రాంతులకు గురై చనిపోతే ఇంకెవరూ అలా మాట్లాడకూడదనేది ప్రత్యర్థులు కుట్ర చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే నారా లోకేశ్‌ హయాంలో నడిచే ఐటీడీపీ, జనసేన సోషల్‌ మీడియాలో గీతాంజలి చేసిన వ్యాఖ్యలను ట్రోల్స్ చేయడంతో ఆమె భరించలేక ఆత్మహత్య చేసుకునేలా చేశాయని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ ఘటనల వెనక నారా లోకేశ్‌ హస్తం ఉందని వైసీపీ నాయకులు ఆరోపించారు. గీతాంజలి ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని, కేవలం సీఎం జగన్‌ తీసుకొచ్చిన పథకాలతో తన కుటుంబానికి జరిగిన మేలు మాత్రమే చెప్పింది. కాగా, గీతాంజలి మరణించిన తర్వాత కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ALSO READ: చంద్రబాబు పంజా.. అప్పుడు బీజేపీ.. ఇప్పుడు జనసేన!

ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా?

టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా సైకోల కారణంగా మృతి చెందిన గీతాంజలికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, నేతలు నివాళులర్పించారు. గీతాంజలిది ఆత్మహత్య కాదు. సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేస్తూ మానసికంగా వేధించడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఇది టీడీపీ, జనసేన సైకోలు చేసిన హత్యగానే పరిగణించాలని చెప్పుకొచ్చారు. కాగా, చనిపో­యిన తల్లి పార్థివదేహం వద్ద ఇద్దరు ఆడపిల్లలు ఏడుస్తుంటే చూసిన ప్రతీ ఒక్కరూ చలించిపో­యారు. మరీ ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా? తల్లిని కోల్పోయిన ఆ ఇద్దరు ఆడబిడ్డల భవిష్యత్తేంటి? టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా సైకోలు తల్లి మమకారాన్ని తిరిగి తెస్తాయా? అంటూ రాష్ట్ర వ్యాప్తంగా గీతాంజలికి మద్దతు ప్రకటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button