తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

The Family Star: ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ లిరికల్ సాంగ్ వచ్చేసింది

టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తుండగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, మేకర్స్ సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

సెకండ్ సింగిల్ ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌ను సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేశారు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో వచ్చే ఈ సాంగ్‌లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఆకట్టుకున్నారు. ట్యూనింగ్ మ్యూజిక్ అదిరిపోయింది. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button