తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు

ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇదేనని, ప్రతి ఇంటికీ మంచి చేస్తూ అడుగులు వేయిస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్ అన్నారు. గతానికి ఇప్పటికీ తేడా గమనించాలని జగన్ కోరారు. విజ‌య‌వాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌లను సీఎం ప్రారంభించారు. అనంతరం విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేశారు.

ALSO READ:  ‘జనసేన’ రాజకీయ ప్రయాణం ముగింపు.. త్వరలో బీజేపీలో విలీనం!

31,866 మందికి సంపూర్ణ హక్కులు

విజయవాడలోని వివిధ కాలనీల్లో 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీల్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి సంపూర్ణ హక్కులు కలిగేలా ఆ కుటుంబాలకు ప‌ట్టాలు ఇచ్చామ‌న్నారు. విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ ఇలా 16 కాలనీలకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం రూ.239 కోట్లతో సివరేజి ట్రీట్మెంట్ ప్లాంట్‌ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అదేరకంగా 9,125 పట్టాలు అనబ్జెక్షబుల్ ల్యాండ్స్‌లో ఉన్న పట్టాలు కూడా పూర్తిగా రెగ్యులరైజ్ జరుగుతోందన్నారు.

ALSO READ: ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచం: ఏపీఈఆర్సీ

58 నెలల కాలంలోనే పూర్తి..

రూ.12.3 కోట్లతో రివర్‌ ఫ్రంట్‌ పార్క్‌ అభివృద్ధి చేశామ‌ని చెప్పారు. విజయవాడలో ఎప్పుడూ జరగని విధంగా రూ.400 కోట్లు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును అభివృద్ధి చేశామన్నారు. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు ఒక్క ఫ్లై ఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి నేడు పెండింగ్‌లో ఉన్న ఫ్లై ఓవర్ పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లై ఓవర్లు నిర్మించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులన్నీ కేవలం ఈ 58 నెలల కాలంలోనే పూర్తి చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button