తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Yashasvi Jaishwal: యశస్వీ జైస్వాల్ కు ఐసీసీ అవార్డు.. జై షా ప్రశంసలు

భార‌త యువ ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్ ఐసీసీ అవార్డు అందుకున్నాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పరుగుల వరద పారించిన య‌శ‌స్వీ ఫిబ్రవ‌రి నెల‌కుగానూ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు.

Also read: ICC: అదరగొట్టిన భారత్.. ఐసీసీ ర్యాంకుల్లో నంబ‌ర్ వన్

కాగా 22 ఏళ్ల జైస్వాల్ ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్‌లో 712 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 2 డ‌బుల్ సెంచ‌రీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అతను ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఓటింగ్‌లో కేన్ విలియ‌మ్సన్, శ్రీ‌లంక ఓపెన‌ర్ ప‌థుమ్ నిస్సంక‌‌ను వెన‌క్కి నెట్టి విజేత‌గా నిలిచాడు. ఇక మ‌హిళా విభాగంలో ఆసీస్ ఆల్ రౌండర్ అనాబెల్ స‌థర్‌లాండ్ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది.

ఐసీసీ అవార్డు గెలుచుకున్న జైస్వాల్‌పై బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రశంసలు కురిపించారు. “ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైన జైస్వాల్‌కు అభినందనలు. ఇటీవల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌పై అత్యుత్తమ ప్రదర్శన కనపరిచాడు. 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు సాధించాడు. మున్ముందు ఇలాంటి అవార్డులు మరిన్ని గెలుచుకోవాలి..” అని జై షా ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button