తెలుగు
te తెలుగు en English
జాతీయం

Haryana: హర్యానా సీఎం రాజీనామా… పదవి చేపట్టనున్న ఖట్టర్ అనుచరుడు

హర్యానా సీఎం మనోహర్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హర్యానాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మనోహర్ లాల్‌తో పాటు మంత్రివర్గమంతా రాజీనామా చేసింది. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ శాసనసభా పక్షంతో సమావేశమై, హర్యానా గవర్నర్‌ను కలిశారని సమాచారం. హర్యానాలో బీజేపీ, దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) విబేధాలు చోటుచేసుకున్నాయి.

Also Read: పౌరసత్వ సవరణ చట్టం… స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్

లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. దీంతో జేజేపీతో పొత్తును బీజేపీ తెగతెంపులు చేసుకుంది. ఈ నేపధ్యంలోనే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గం సమిష్టిగా రాజీనామా చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు.. సీఎం అధికార బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వానికి మద్దతు కోరుతూ స్వతంత్ర ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: సికింద్రాబాద్- విశాఖ కొత్త వందేభారత్ రైలు.. ప్రారంభించిన మోడీ

హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. వీళ్ల భేటీలో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య ఎటువంటి ఒప్పందం కుదరలేదు. ఈ నేపథ్యంలో దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Also Read: ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచం: ఏపీఈఆర్సీ

ఇదిలా ఉంటే.. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41, జేజేపీకి 10, కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనితో పాటు బీజేపీకి ఆరుగురు స్వతంత్రులు, ఒక హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు ఉంది. ఈ లెక్కన.. జేజేపీ విడిపోయిన తర్వాత కూడా బీజేపీకి 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని లెక్క తేలుతోంది.

Also Read: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. మెట్రో ఎసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

మరో వైపు… హర్యానా కొత్త సీఎంగా నాయాబ్ సింగ్ సైనీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు. కాగా, ఈయన మాజీ సీఎం ఖట్టర్ ప్రధాన అనుచరుడు కావడం విశేషం. 2016లో ఖట్టర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన నయాబ్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2023లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button