తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Lahiru Thirimanne: టెంపుల్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..మాజీ క్రికెట‌ర్‌కు గాయాలు

శ్రీలంక మాజీ క్రికెటర్‌ లాహిరు తిరిమన్నె రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గురువారం కుటుంబ సభ్యలతో కలిసి గుడికి వెళ్తుండ‌గా అనురాధపుర సమీపంలో కారు లారీని ఢీకొట్టగా కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ‌తింది. ఈ ఘటనలో తిరిమన్నెతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం అందరూ క్షేమంగా బయటపడడంతో లంక అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న లంక బోర్డు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

ALSO READ: యశస్వీ జైస్వాల్ కు ఐసీసీ అవార్డు.. జై షా ప్రశంసలు

2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన లెఫ్టాండర్‌ బ్యాటర్‌ లాహిరు తిరిమన్నె.. 44 టెస్టులు, 127 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 2,088, 3,164, 291 పరుగులు చేశాడు. గతేడాది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లాహిరు తిరిమన్నె.. ప్రస్తుతం లీగ్‌ క్రికెట్‌ ఆడుతున్నాడు. లెజెండ్స్‌ క్రికెట్‌ ట్రోఫీ 2024 ఈవెంట్లో భాగమైన అతడు.. న్యూయార్క్‌ స్ట్రైకర్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button