తెలుగు
te తెలుగు en English
జాతీయం

Ram Nath Kovind: జమిలి ఎన్నికలపై పూర్తైన అధ్యాయనం…. రాష్ట్రపతికి తుది నివేదిక అందజేత

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యా సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తైంది. ఈ మేరకు తుది నివేదికను నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. దేశంలో ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది.

Also Read: ఉత్కంఠకు తెర.. ఎల్లుండే లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్?

ఈ కమిటీ ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదంతో జమిలి ఎన్నికల నిర్వహణ దేశంలో ఎంతవరకు సాధ్యం, ఇతర అంశాలపై వివిధ వర్గాల నుంచి సమాచారం, అభిప్రాయాలు సేకరించింది. నేడు రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును కలిసి తుది నివేదికను సమర్పించింది. మొత్తం 18,626 పేజీలతో కూడిన రిపోర్ట్‌ను రాష్ట్రపతికి అందించింది.

Also Read: రెండో అతిపెద్ద యూనివర్సిటీ..నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కర్నూల్!

దాదాపు 190 రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించింది. అనంతరం నివేదికను రూపొందించింది. లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాలని కమిటీ తమ నివేదికలో సూచించినట్లు తెలుస్తోంది. మూడుస్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని అందులో పేర్కొన్నట్లు సమాచారం.

Also Read: మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ పేరే

ఏకకాల ఎన్నికల నిర్వహణపై గత కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తున్న మోదీ సర్కారు.. 2023 సెప్టెంబరులో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నియమించింది. కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది.ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్‌ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button