తెలుగు
te తెలుగు en English
జాతీయం

Maharastra Cabinet: మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ పేరే

మహారాష్ట్ర కేబినెట్ అహ్మద్ నగర్ జిల్లా పేరును అహల్య నగర్ గా మార్చాలని నిర్ణయించింది. ఈమేరకు సీఎం షిండే ట్విట్టర్ (ఎక్స్) లో తెలిపారు. అహ్మద్ నగర్ నగరాన్ని పుణ్య శ్లోక్ అహల్యాదేవి నగర్ గా మార్చడానికి కేబినెట్ ఆమోదం లభించిందని చెప్పారు.

Also read: BJP: బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారు: బండి సంజయ్

కాగా 2023 మేలో అహ్మద్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం ఏక్ నాథ్ షిండే అహ్మద్ నగర్ పేరును అహల్య నగర్ గా మారుస్తున్నట్లు ప్రకటించారు. అహ్మద్ నగర్ జిల్లాలోని చొండి గ్రామంలో జన్మించిన మరాఠా సామ్రాజ్య రాణి అహల్యా బాయి హోల్కర్ గౌరవార్థం ఆమె పేరుతో అహల్యానగర్ గా మారుస్తున్నట్లు సీఎం ఏక్ నాథ్ షిండే తెలిపారు. 18వ శతాబ్ధపు రాణి 298వ జయంతి సంరద్భంగా షిండే ఈ ప్రకటన చేశారు.

గతంలో 2023 సెప్టెంబర్ లో ఔరంగాబాద్ రెవెన్యూ డివిజన్ ను శంభాజీనగర్ గా, ఉస్మానాబాద్ రెవెన్యూ డివిజన్ ను ధరాశివ్ రెవెన్యూ డివిజన్ గా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 29, 2022న ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు కారణంగా రాజీనామా చేయడానికి ఒకరోజు ముందు అప్పటి సీఎం ఉద్ధవ్ థాకరే ఈ డివిజన్ల పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన అంతిమంగా కాంగ్రెస్, ఎన్ సీపీ, శివసేన మహావికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం పడిపోవడానికి దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button