తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hanuman: హనుమాన్ ఓటీటీ ఆలస్యంపై స్పందించిన డైరెక్టర్

తేజ సజ్జా హీరోగా వచ్చిన ‘హనుమాన్’ మూవీ ఈఏడాది బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ మూవీ రూ.300కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా విడుద‌లై రెండు నెల‌లు గడిచిన ఇంకా ఓటీటీలోకి రాలేదు. తాజాగా, ఓటీటీ ప్రకటన వచ్చినప్పటికి పలు కార‌ణాలతో వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

ALSO READ: ఓటీటీలోకి వెన్నెల కిశోర్ కొత్త మూవీ‘చారి 111’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స‌పోర్ట్ చేయండి..

ఓటీటీ ఆలస్యంపై ‘హనుమాన్’ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ స్పందించారు. ‘హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం కావ‌డం అనేది ఉద్దేశపూర్వకంగా చేస్తుంది కాదు. బెస్ట్ అవుట్‌పుట్ అందించాల‌ని చూస్తున్నాం. ఆలస్యం చేయడం మా ఉద్దేశ్యం కాదు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మాకూ స‌పోర్ట్ చేయండి. ధన్యవాదాలు’ అంటూ ప్ర‌శాంత్ వ‌ర్మ రాసుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button