తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: పిఠాపురం చుట్టూ రాజకీయం.. పవన్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ!

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం రాజకీయమంతా పిఠాపురం చుట్టూ తిరుగుతోంది. పిఠాపురం కేంద్రంగా కొత్త పాలిటిక్స్‌ మొదలయ్యాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాగా, పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా వంగా గీతాను ప్రకటించడంతోపాటు మిథున్ రెడ్డికి పిఠాపురం ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. అయితే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ అతని కుమారుడు గిరితో కలిసి వైసీపీలో చేరనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుండడంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ALSO READ: పచ్చి మోసగాళ్లు, దగాకోరులతో యుద్ధం.. సీఎం జగన్

బరిలోకి ముద్రగడ!

పవన్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడను బరిలోకి దించాలని యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే గెలుపు అంచనాలు అన్నింటినీ బేరీజు వేసుకుని పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనానికి గెలుపు అంత ఈజీగా దక్కేలా కనిపించడం లేదు. పవన్‌ను ఓడించేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈసారి కూడా పవన్‌ కళ్యాణ్‌కు చెక్‌ పెట్టాలని వైసీపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పిఠాపురం నుంచి పవన్‌పై ముద్రగడను బరిలో దించాలని ప్లాన్‌ చేస్తోంది. ముద్రగడ అయితేనే పవన్‌పై బలమైన అభ్యర్థి అవుతారని అనుకుంటున్నట్లు సమాచారం.

ALSO READ: లా వర్సిటీకి రూ.1,000కోట్లు.. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే ‘ఈబీసీ నేస్తం’

వంగా గీతతో చర్చలు..

పిఠాపురం వైసీపీ ఇన్‌చార్జిగా వంగా గీతను వైఎస్‌ జగన్‌ నియమించిన సంగతి తెలిసిందే. అయితే ముద్రగడ వైసీసీలోకి రానున్న నేపథ్యంలో సీఎం జగన్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వంగా గీతను సీఎంఓకు పిలిపించుకుని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరితే.. ఆయన కుటుంబం నుంచి ఒకరిని పిఠాపురం నుంచి బరిలోకి దింపాలన్న ఆలోచనలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ భేటీలో గీత కూడా ముద్రగడ పార్టీలోకి వస్తే తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వంగా గీతకు పిఠాపురం ఎమ్మెల్యే స్థానం బదులుగా కాకినాడ పార్లమెంట్ పరిధిలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button