తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: బీజేపీలో టికెట్ల పంచాయితీ.. చంద్రబాబుపై ఫిర్యాదు!

ఏపీ కాషాయ పార్టీలో టికెట్ల పంచాయితీ హస్తినకు చేరింది. రాష్ట్రంలో పొత్తులపై స్థానిక బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు సీనియర్‌ నేతలు హైకమాండ్‌కు లేఖ రాయడం కలకలం సృష్టించింది. పొత్తులో భాగంగా సీట్లు, అభ్యర్థుల ఖరారుపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ, అమిత్ షాకు లేఖ రాశారు.

ALSO READ: వైసీపీలో చేరిన ముద్రగడ.. జగన్ గెలిచేందుకు కృషి చేస్తా!

హైకమాండ్‌కు లేఖ

బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుపై చర్చ జరిగింది. ఇందులో బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ అదే విధంగా జనసేనకు 2 ఎంపీ, 21 అసెంబ్లీ సీట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే పొత్తు అంశంపై 16 మంది బీజేపీ సీనియర్ నాయకులు హైకమాండ్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో బీజేపీ అడుగుతున్న సీట్లపై తేల్చకుండానే చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించారని, బీజేపీకి గెలవని సీట్లు కేటాయిస్తున్నారంటూ మండిపడ్డారు.

ALSO READ: పిఠాపురం చుట్టూ రాజకీయం.. పవన్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ!

పోలింగ్ బూత్ ఏజెంట్లు లేని స్థానాలు

గతంలో టీడీపీ ఓడిపోయినవి.. ఏ మాత్రం బలం లేని స్థానాలైన బద్వేలు, జమ్మలమడుగు, అనపర్తి, విజయవాడ వెస్ట్, ఆధోని వంటి సీట్లు బీజేపీకి కేటాయిస్తున్నట్లు విశ్లేషించారు. అదే విధంగా టీడీపీ చేతిలో ఉన్న నేతలుగా గుర్తింపు ఉన్న వారికి బీజేపీలో సీట్లు ఇవ్వడం ద్వారా పార్టీకి భర్తీ చేయలేని నష్టం ఖాయమని హెచ్చరించారు. అలాగే సీఎం సొంత జిల్లా వైఎస్సార్ కడపలో రెండు సీట్లు కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బద్వేలు లాంటి అసెంబ్లీలో కనీసం పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా లేరని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button