తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Bollywood: ‘బడే మియా చోటే మియా’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !!!

ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం బడే మియా చోటే మియా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కళ్ళు చెదిరే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్నారు. మార్చి 26న ఈ చిత్ర ట్రైలర్ ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Also Read: ‘రజాకార్’ నిర్మాతకు బెదిరింపు కాల్స్..హై సెక్యూరిటీ

బడే మియా చోటే మియా చిత్రం కోసం ఇప్పటికే యాక్షన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్టన్ అవతారంలో హీరోయిన్లు మానుషీ చిల్లర్, ఆలయ ఫార్ట్యూన్ వాలా కనిపిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, హై యాక్షన్ సన్నివేశాలు అలరించబోతున్నాయి. 

Also Read: దేవర మూవీ వీడియో లీక్.. ఫైర్ అవుతున్న మేకర్స్

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వశు భగ్నానీ, దీప్షిక దేశముఖ్, జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button