తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Merry Christmas: ఓటిటిలోకి వచ్చేస్తున్న మెర్రీ క్రిస్మస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమిళ స్టార్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ మెర్రీ క్రిస్మస్. మంచి అంచనాలతో ఈ మూవీ జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ హైప్ తో రిలీజ్ అయిన మెర్రీ క్రిస్మస్ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన మెర్రీ క్రిస్మస్ చిత్రం ఇప్పుడు ఓటిటిలోకి రానుంది. మెర్రీ క్రిస్మస్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్ ఫాం సొంతం చేసుకుంది. మార్చి 8న ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ రానుందని తెలుస్తోంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేలా మెర్రీ క్రిస్మస్ మూవీ మేకర్స్ తో ఓటిటి డీల్ చేసుకుంది నెట్ ఫ్లిక్స్.

Also read: NBK 109: బాలయ్య 109 మూవీ అప్డేట్.. లక్కి ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరోయిన్

ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కు ఈ చిత్రం వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా నటించగా.. అశ్వినీ కల్సేఖర్, ల్యూక్ కెన్నీ, పరి మహేశ్వరి శర్మ, సంజయ్ కపూర్, టినూ ఆనంద్, రాధికా ఆప్టే, గాయత్రీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ హిందీ, తమిళం ద్విభాషా చిత్రంగా రూపొందింది. అంధాధున్ వచ్చిన చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మెర్రీ క్రిస్మస్ చిత్రానికి ప్రీతమ్, డానియెల్ బీ జార్జ్ సంగీతం అందించారు. టిప్స్ ఫిల్మ్స్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ బ్యానర్లపై రమేశ్ తౌరానీ, జయ తౌరానీ, సంజయ్ రౌట్రే, కావల్ గార్గ్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ. 60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీకి రూ. 30 కోట్లలోపే కలెక్షన్లు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button