తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP: చంద్రబాబు జూ. ఎన్టీఆర్‌ను గెంటేస్తారు… కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను గెంటేస్తారని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి చంద్రబాబును గొయ్యి తీసి పాతి పెడితే అప్పుడు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుందన్నారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు తిప్పుకుని యాక్సిడెంట్ అయితే ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

Also Read: అండ‌ర్‌వాట‌ర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని

చంద్రబాబు తుప్పు అని ఆయన కొడుకు లోకేష్ పప్పు అని.. ఆయనకు పుట్టిన రోజుకు చావుకు కూడా తేడా తెలియదన్నారు. లోకేష్ ను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయాలని… టీడీపీకి అధ్యక్షుడిని చేయాలని తద్వారా జూనియర్ ఎన్టీఆర్ ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారన్నారు. ఒక వేళ చంద్రబాబు, లోకేష్ ను గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా అనాథను చేస్తారని ఆరోపించారు.

Also Read:  బీఆర్ఎస్‌కు షాక్… కీలక నేత గుడ్ బై!

అంబేద్కర్ బాటలో నడుస్తున్న సీఎం జగన్‌కు అందరూ అండగా నిలవాలని… మంచి చేస్తేనే ఓటేయమని దమ్ముగా అడుగుతున్నారన్నారు. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాలని కోరారు. ప్రజల కోసం 120 సార్లు బటన్ నొక్కిన జగన్ కోసం రెండు బటన్‌లు నొక్కండని విజ్ఙప్తి చేశారు. ఈ సారికి చంద్రముఖిని ఈవీఎంలలో బంధించండని… ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతుందంటూ కొడాలి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button