తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

NBK 109: బాలయ్య 109 మూవీ అప్డేట్.. లక్కి ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరోయిన్

నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ ఫిల్మ్ బాబీ డైరెక్షన్ లో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా చాలా విభిన్నమైన యాక్షన్.. ఎమోషన్ తో పాటు సోషల్ మెసేజ్ ను టచ్ చేయబోతున్నట్లు సమాచారం. నిర్మాత నాగ వంశీ, సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రొడక్షన్ టీమ్ తోనే మేకర్స్ ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేశారు.

Also read: Kalki 2898 AD: కల్కి మూవీ ట్రైలర్ అప్డేట్.. నెట్టింట వైరల్

అంతేకాకుండా.. ఈప్రాజెక్టులో మరో ముఖ్యమైన పాత్ర కోసం ఓ యంగ్ హీరో కూడా నటిస్తున్నాడట. తెలుగువారికి సుపరిచుతులైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ను రంగంలోకి దింపుతున్నాడు బాబీ. అలాగే ఈ సినిమాలో భగవంత్ కేసరిలో మాదిరిగా విజ్జి పాప లాంటి క్యారెక్టర్ ఒకటి డిజైన్ చేశారట బాబీ. అంతేకాదు.. ఈ సినిమాకు ఆ పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతుందంట. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కోసం తెలుగు బ్యూటీ చాందిని చౌదరిని తీసుకునేందుకు చర్చలు జరిగినట్లు సమాచారం.

అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న లీక్ ప్రకారం.. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కి జోడీగా చాందిని కనిపించబోతుందట. త్వరలో ఇదే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. బాలయ్య వంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చిందంటూ చాందినీ తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించినట్లు టాక్ వినిపిస్తోంది. కలర్ ఫోటో మూవీతో ఆడియన్స్ దగ్గరైన ఈ తెలుగు అమ్మాయి.. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button