తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP: టీడీపీ బీసీ అనుకూల పార్టీ ఎలా అవుతుంది?

మాట మాట్లాడితే తమది బీసీ అనుకూల పార్టీ అని భుజాలు తడుముకునే టీడీపీ అధినేత చంద్రబాబు నిజస్వరూపం మరోసారి నిరూపితమైంది. ఇటీవల తాను ప్రకటించిన 94 స్థానాల్లో 21 సీట్లు కమ్మ, 18 సీట్లు మాత్రమే బీసీ అభ్యర్థులకు కేటాయించింది. జనాభా పరంగా అత్యధిక శాతం ఉన్న బీసీలకు 94లో కేవలం 18 సీట్లు ప్రకటించిన టీడీపీ బీసీ అనుకూల పార్టీ ఎలా అవుతుంది. అంతేకాదు, రాజకీయాల్లో చంద్రబాబు బీసీలకు ఎలా అన్యాయం చేస్తున్నారో వెల్లడించే సత్యాలను ఓసారి పరిశీలిద్దాం.

  • టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మొత్తం 45 మంది ఎంపీలను రాజ్యసభకు పంపే అవకాశం వచ్చింది. కానీ, ఒక్క బీసీని కూడా పంపలేదు.
  • కానీ వైఎస్‌ జగన్‌ హయాంలో 11 రాజ్యసభ స్థానాల్లో బీసీలకు నాలుగు స్థానాలు కేటాయించారు.
  • వైఎస్‌ జగన్‌ 17 మంది బీసీలను ఎమ్మెల్సీలను చేశారు. చంద్రబాబు నాయుడు తన కాలంలో ఇంత మంది బీసీలకు అవకాశం ఇవ్వలేదు.
  • వచ్చే ఎన్నికల్లో బీసీలకు వైఎస్సార్సీపీ కంటే ఎక్కువ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తానని చెప్పే ధైర్యం ఉందా?
  • రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీసీలకు వైఎస్సార్‌సీపీ కేటాయించిన టిక్కెట్ల కంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు చెప్పగలరా?
  • పెనమలూరులో పార్థసారథి కోసం కమ్మ అభ్యర్థిని మార్చే సాహసం చేయని చంద్రబాబు.. యాదవ వర్గానికి చెందిన పార్థసారథిని నూజివీడుకు తరలించి అక్కడ మరో యాదవ నేత టిక్కెట్‌కు గండి కొట్టారు.
  • కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నారా లోకేశ్‌ను సైతం ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని తరలించి, అక్కడ పద్మశాలి వర్గానికి సీటు కట్టబెట్టగలిగారు.
  • ⁠నర్సరావుపేటలో యాదవ వర్గానికి టిక్కెట్ కోసం జగన్ కమ్మ అభ్యర్థిని సైతం పక్కన పెట్టారు. కానీ యాదవులు అధికంగా ఉండే ఒంగోలు/నెల్లూరు లోక్‌సభ స్థానాల్లో పోటీకి చంద్రబాబు ధనవంతులైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కోసం వెతుకుతున్నారు.
  • ⁠గోదావ‌రి జిల్లాల్లోని 5 లోక్‌స‌భ‌ నియోజకవర్గాల్లో వైఎస్ జ‌గ‌న్ 3 బీసీ, 1 ఓసీ (కాపు), 1 ఎస్సీ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. అదే చంద్రబాబు మాత్రం 4 స్థానాల్లో ఓసీ, 1 స్థానంలో ఎస్సీలకు అవకాశం ఇచ్చారు. ఓసీలో కూడా ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం ఇచ్చారు.
  • ఇక జగన్ తన క్యాబినెట్‌లో బీసీలకు చెందిన 11 మందికి మంత్రులుగా ఛాన్స్ ఇస్తే, చంద్రబాబు హయాంలో కేవలం 8 మందికే అవకాశం ఇచ్చారు.
  • జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంటే.. బీసీలకే 6 జిల్లా పరిషత్‌ చైర్మన్/ చైర్‌పర్సన్‌ పదవులు (46 శాతం) కేటాయించారు.
  • 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకోగా 44 చైర్మన్/ చైర్ పర్సన్‌ పదవులు బీసీలకే (53 శాతం) ఇచ్చారు.
  • 14 కార్పొరేషన్‌లలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేయగా 9 చోట్ల మేయర్‌ పదవులు (64 శాతం) బీసీలకే ఇచ్చారు.

ALSO READ: దేశాన్ని ఆకర్షించే ఐకానిక్..ఏపీ రాజధానిగా విశాఖ!

వాస్తవానికి టీడీపీ ఎన్నడూ బీసీ పార్టీ కాదు. ప్రధానంగా రెడ్డిల మద్దతు ఉన్న కాంగ్రెస్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం తెలంగాణలో ఉండేది. తెలంగాణలో కమ్మ సామాజికవర్గం తక్కువగా ఉండడంతో అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని స్థానాల్లో బీసీలకు అవకాశం ఇచ్చింది. అంతేతప్ప బీసీల పట్ల ప్రేమతో మాత్రం కాదు. ఇక రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి, టీడీపీలో బీసీ అభ్యర్థుల వాటా గణనీయంగా పడిపోయింది. ఎందుకంటే ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో బీసీలు అవసరం లేదు, అది సొంత కమ్మ సామాజికవర్గంపైనే ఆధారపడుతుంది. కానీ వైఎస్‌ జగన్‌ మాత్రం అలా కాదు. అన్ని వర్గాల వారిని కలుపుకొని పాలన సాగిస్తారు. బీసీలకే కాకుండా ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు కూడా ఎక్కువ పదవులు ఇచ్చారు. ఇది కొంతమంది రెడ్డి సామాజికవర్గ నాయకులకు కోపం తెప్పించినప్పటికీ, పలు సర్వేల్లో వెల్లడైనట్లుగా ఇది జగన్‌కు సానుకూల వాతావరణాన్నే కల్పిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button