తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Rana Naidu: రానా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రానా నాయుడు సీజన్ 2 నుంచి అప్డేట్?

రియల్ లైఫ్ బాబాయ్, కొడుకులు.. వెంకటేష్, రానా రీల్ లైఫ్ తండ్రి, కొడుకులుగా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకుల నుంచి మిగతా అన్ని భాషల ప్రేక్షకుల వరకు ఒక్కసారిగా షాక్ కలిగించింది. మరీ ముఖ్యంగా వెంకటేష్, రానా ఇద్దరికీ తెలుగులో కాస్తా క్లీన్ ఇమేజ్ ఉండడంతో రానా నాయుడు మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఒకింత షాక్ కలిగించడమే కాదు ఏంట్రా ఇది అనిపించేలా కూడా చేసింది. బూతులు శృతిమించి ఉండడంతో తెలుగు వాళ్లయితే కొంత ఇబ్బంది పడ్డారు కూడా. ఇక ఈ వెబ్ సిరీస్ కి సీజన్ 2 కూడా ఉంటుందని సీజన్ వన్ స్ట్రీమింగ్ సమయంలో వెల్లడించారు.

Also read: Merry Christmas: ఓటిటిలోకి వచ్చేస్తున్న మెర్రీ క్రిస్మస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇక తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈనెల 25 నుంచి సీజన్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతోంది. వెంకటేష్ తో పాటు రానా తో పలు కీలక సన్నివేశాలు మొదటి షెడ్యూల్ లో షూట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజనీకాంత్ సినిమాలో రానా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరొక పక్క వెంకటేష్ సైంధవ్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా ఫైనల్ చేయలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది కానీ అధికారిక ప్రకటన రాలేదు. రానా నాయుడులో నుర్వీన్ చావ్లా, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై వంటివారు ఇతర కీలక పాత్రల్లో నటించగా.. కరణ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button