తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Naveen Chandra: ప్రతి మిస్ట్రీ వెనుక సైంటిఫిక్ ఎక్స్‌ప్లేనేషన్ ఉంటుంది: ఇన్‌స్పెక్టర్‌ రిషి ట్రైలర్‌

హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడిగా నవీన్ చంద్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సౌత్‌ ఇండియాలో సినిమాలతో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ ఆయన నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ అనే వెబ్‌ సిరీస్‌ నుంచి ట్రైలర్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో విడుదల చేసింది. ఈ వెబ్ సిరీస్ కి నందిని దర్శకత్వం వహించారు. మొత్తం 10 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. తెలుగు,తమిళ్‌తో పాటు ఐదు భాషల్లో మార్చి 29 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read: మెగాస్టార్ కు జోడీగా సమంత.. షూటింగ్ కూడా పూర్తి?

తాజాగా విడుదలైన ట్రైలర్‌ చాలా ఆసక్తిగా ఉంది. ప్రతి సీన్‌ ప్రేక్షకుడిని సస్పెన్స్ సన్నివేశాలతో మెప్పిస్తుంది. ఊహించలేనంత విజువల్స్‌తో వస్తున్న ఈ సిరీస్‌ తప్పకుండా ప్రేక్షకులను భయపెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతు చిక్కని హత్యల వెనక ఎవరున్నారనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ మిస్టరీని ఇన్‌స్పెక్టర్‌ రిషి ఎలా ఛేదించారన్నది తెలియాలంటే ఈ సిరీస్‌ చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button