తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: కూటమి నుంచి వలసలు.. వైసీపీలో కోలాహలం!

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు టీడీపీ, జనసేన సీనియర్ నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలోకి వలసల క్యూ పెరగడంతో తాడేపల్లి సీఎం కార్యాలయం కోలాహలంగా మారింది. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు టీడీపీ, జనసేన నేతలు వారి అనుచరులతో కలిసి క్యాంపు కార్యాలయానికి చేరుకోగా.. అందరినీ జగన్ వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ALSO READ:  జగన్ మరో యాత్రకు శ్రీకారం.. నేటినుంచే ప్రచారం!

విజయవాడపై ఫోకస్..

వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ముందుగా విజయవాడపై ఫోకస్ పెట్టారు. టీడీపీ, జనసేన నాయకులను పార్టీలో చేర్చుకోవడంతోపాటు ఈస్ట్‌పై స్పెషల్ ఫోకస్ పెంచారు. కాగా, నియోజకవర్గంలో సీనియర్ నేత యలమంచిలి రవి గత కొంతకాలంగా తటస్థగా ఉన్నారు. ఇందులో భాగంగా అక్కడ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌ను గెలిపించేందుకు సమన్వయంతో వ్యవహరించాలని రవికి సూచించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుతో జగన్ నేరుగా చర్చలు జరిపారు.

ALSO READ: అనకాపల్లి ఎంపీ అభ్యర్థి పేరును ప్రకటించిన వైసీపీ

టీడీపీ కేడర్‌ ఆగ్రహం..

సూళ్లూరుపేట టీడీపీ సీనియర్‌ నేత వేనాటి రామచంద్రారెడ్డి వైసీపీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వైఎస్‌ జగన్‌ సమక్షంలో చేరారు. మరోవైపు కృష్ణాజిల్లా అవనిగడ్డలో టీడీపీ నాయకులు ఒక అడుగు ముందుకేసి 30మందికిపైగా తమ పార్టీ పదవులకు ఏకంగా రాజీ­నామా చేస్తూ ఆ లేఖలను పార్టీ అధిష్టానానికి పంపించారు. అయితే 40 ఏళ్లుగా టీడీపీ జెండాను మోస్తూ పార్టీ మనుగడకోసం పాటుపడిన వారికి కాకుండా వేరే వ్యక్తులకు టికెట్‌ ఇవ్వడంపై టీడీపీ కేడర్‌ మండిపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button