తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: లంచాలు, వివక్ష లేవు.. అర్హత ఉంటే చాలు!

గత 58 నెలల కాలంలో రాష్ట్రంలో ఎక్కడా లంచాలు, ఎక్కడా వివక్ష లేవని, అర్హత ఉంటే చాలు ఏ పార్టీ అని చూడకుండా సంక్షేమ పథకాలు అందించామని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో రెండోరోజు ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని స్వయంగా ఆయన గణాంకాలతో వివరించారు. ప్రభుత్వ పథకాలతో కేవలం ఒక్క ఎర్రగుంట్లలోనే 93 శాతం మంది లబ్ధి పొందారని సీఎం జగన్‌ వివరించారు.

ALSO READ: పాలనపై ఫీడ్‌బ్యాక్‌.. రెండోరోజు ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి!

నేరుగా ఖాతాల్లో జమ..

అధికారంలోకి వచ్చిన తర్వాత తాను బటన్‌లు నొక్కి.. నేరుగా అకౌంట్‌లలో నగదు జమ చేస్తున్నానని జగన్ చెప్పారు. అమ్మ ఒడి కింద ఒక్క ఎర్రగుంట్లలో 1,043 మంది తల్లులకు లబ్ధి చేకూరిందని, రూ. 4.69 కోట్లు అందించామన్నారు. వైఎస్సార్‌ ఆసరా ద్వారా రూ. 3 కోట్లు, ఆరోగ్యశ్రీ కింద రూ. 2 కోట్లు, 1,496 ఇళ్లకుగానూ 1391 ఇళ్లకు లబ్ధి చేకూరిందని, చేదోడు కింద రూ. 31.20 లక్షలు అందించామని, మొత్తంగా ఎర్రగుంట్లకు ఈ 58 నెలల కాలంలో రూ. 48.74 కోట్లు అందించామన్నారు.

ALSO READ: హైదరాబాద్ సీటుపై హస్తం గురి.. తెరపైకి సానియా మీర్జా పేరు?

చిన్నోడిగా అడుగుతున్నా..

నా కంటే ముందు 75 ఏళ్ల వయసున్న ఓ ముసలాయన పరిపాలన చేశాడని, వయసులో నేను చాలా చిన్నోడిని అని జగన్ చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఈ చిన్నోడిగా అడుగుతున్నా.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి అనుభవం మీ జీవితాలు మార్చిందా? అని ఎర్రగుంట్ల ప్రజలను అడిగారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామాలు, ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయన్నారు. ఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు.. మనకు జరిగిన మంచిని చూసి మన భవిష్యత్తు కోసం ఓటేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button