తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Prabhas: లండన్‌లో లగ్జరీ హౌస్‌ కొనుగోలు చేసిన ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్‌ సినిమాతో మెప్పించారు. తాజాగా, ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. లండన్‌లో ప్రభాస్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. గతంలో షూటింగ్స్‌, వేకేషన్‌కు వెళ్లినప్పుడు అద్దె ఇంట్లో ఉన్నారని తెలుస్తోంది. దీనికి దాదాపు కోటి రూపాయల రెంట్ చెల్లించేవారని సమాచారం. తాజాగా ఆ ఇంటినే భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు.

ALSO READ: రామ్ చ‌ర‌ణ్‌కు ఐకాన్ స్టార్ స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్.. వీడియో వైరల్

గతేడాది డిసెంబర్ 22న సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా.. రూ. 650 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణే, అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ, కమల్ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button