తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Family Star: ఫ్యామిలీ స్టార్ ట్రైలర్‌… చాలా రిలీఫ్‌గా ఉందంటున్న విజయ్ దేవరకొండ

గీత గోవిందం సినిమా తర్వాత విజయ్‌ దేవరకొండ నుంచి వస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఫ్యామిలీ స్టార్‌. గీతగోవిందం ఫేం పరశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మరాఠీ భామ మృణాళ్‌ ఠాకూర్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఇటీవలే హోలీ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి థర్డ్‌ సాంగ్‌ మధురం కదాను విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయనుండటంతో ప్రమోషన్స్‌తో మేకర్స్‌ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఫ్యామిలీ స్టార్ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.

Also Read: లండన్‌లో లగ్జరీ హౌస్‌ కొనుగోలు చేసిన ప్రభాస్

స్వామి నా జీవితంలో కొత్తగా బ్రేక్‌లు ఇవ్వకున్నా పర్వాలేదు..కానీ ఉన్నదాన్ని మాత్రం చెడగొట్టకు.. అంటూ విజయ్‌ దేవరకొండ స్టైల్‌ డైలాగ్స్‌తో షురూ అయింది ట్రైలర్‌. ఫ్యామిలీ స్టార్‌ కుటుంబం చుట్టూ తిరిగే ఫన్‌ అండ్‌ సీరియస్‌ ఎలిమెంట్స్‌తో సినిమా వినోదాత్మకంగా సాగనున్నట్టు ట్రైలర్‌ చెబుతోంది. పరశురాం మరోసారి తన మార్క్‌ను సినిమాలో పర్‌ఫెక్ట్‌గా చూపించబోతున్నట్టు చెప్పకనే చెబుతోంది. మరోవైపు ఫ్యామిలీ స్టార్‌ టైటిల్‌ లుక్‌, గ్లింప్స్, టీజర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

Also Read: రామ్ చ‌ర‌ణ్‌కు ఐకాన్ స్టార్ స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్.. వీడియో వైరల్

ఇక ఈ సినిమాలో మిడిల్ క్లాస్ మ్యాన్‍గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు.. అలాగే మూవీలో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటించగా, దివ్యాంశ కౌశిక్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎమోషనల్ మూమెంట్స్‌తో కూడిన సాధారణ ఫ్యామిలీ డ్రామా అని ట్రైలర్ ను చూస్తుంటే తెలుస్తుంది.. ఈ సినిమాకు గోపి సుందర్ చక్కటి సంగీతాన్ని అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button