Kelvin Kiptum: రోడ్డు ప్రమాదంలో మారథాన్ స్టార్ అథ్లెట్ కెల్విన్ కన్నుమూత
కెన్యాకు చెందిన మారథాన్ స్టార్ అథ్లెట్ కెల్విన్ కిప్టుమ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఆదివారం కెన్యాలోని ఎల్డొరెట్ సిటీ సమీపంలో రాత్రి 11 గంటలకు కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ కారులో మొత్తం ముగ్గురు ఉండగా.. ఇద్దరు అక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగే ముందు కిప్టుమ్ స్వయంగా కారు డ్రైవింగ్ నడిపినట్లు తెలిసింది. అతి వేగం కారణంగానే వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ తర్వాత సమీపంలోని చెట్టును ఢీకొట్టింది.
ALSO READ: పనిచేయని భారత్ స్పిన్ మాయాజాలం.. భారత్ టార్గెట్ ఎంతంటే?
జీర్ణించుకోలేకపోతున్న క్రీడాభిమానులు..
ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న కెల్విన్ అర్థాంతరంగా ప్రమాదంలో చనిపోవడంతో క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మారథాన్ రన్నర్లకు పెట్టింది పేరైన కెన్యాలో పుట్టిన కెల్విన్ చిన్నవయసులోనే కెరీర్ ప్రారంభించాడు. అతడు తొలిసారి 2022లో వలెన్సియా మారథాన్లో పాల్గొన్నాడు. అక్కడితో మొదలైన కెల్విన్ ప్రభంజనం 2023లోనూ కొనసాగింది. గతేడాది అక్టోబర్లో జరిగిన చికాగోలో మారథాన్లో కెల్విన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.