తెలుగు
te తెలుగు en English
క్రికెట్

U-19 World Cup Final: పనిచేయని భారత్ స్పిన్ మాయాజాలం.. భారత్ టార్గెట్ ఎంతంటే?

అండర్-19 వరల్డ్ కప్‌ 2024 ఫైనల్ లో ఆస్ట్రేలియా- భారత్ ముందు 254 పరుగుల భారీ టార్గెట్ నిలిపింది. హర్జాస్ సింగ్ (55) అర్ధశతకం బాదగా, వీబ్‌జెన్(48), డిక్సన్(42), ఆలివర్ పీక్ (41) కూడా కీలకమైన పరుగులను రాబట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.

Also read: Jack Leach: భారత్ తో ఇంగ్లాండ్ టెస్ట్.. సిరీస్ నుంచి స్టార్ స్పిన్నర్ ఔట్

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. సామ్ కొంటాస్(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. రామ్ లింబానీ ఓ చక్కని బంతితో అతన్ని బౌల్డ్ చేశాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన వీగెన్(48).. హ్యారీ డిక్సన్‌ (42)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. ఈ జోడీని నామన్ తివారీ విడగొట్టాడు. వరుస ఓవర్లలో ఇద్దరిని పెవిలియన్ చేర్చాడు.

ఇక 99 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఇన్నింగ్స్‌ను హర్జాస్ సింగ్-ర్యాన్ హిక్స్ చక్కదిద్దారు. ఓవైపు నిలకడగా ఆడుతూనే.. మరోవైపు బౌండరీలు సాధించారు. అనంతరం భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. భారత బౌలర్లలో లింబానీ 3 వికెట్లు పడగొట్టగా.. నామన్ తివారీ 2, సామీ పాండే, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్ లో భారత స్పిన్నర్ల మాయాజాలం ఏమాత్రం పనిచేయలేదు. పైగా స్పిన్నర్లను ఆసీస్ బ్యాటర్లు ఓ ఆట ఆడుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button