తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Animal: ‘యానిమల్’ మూవీ అరుదైన రికార్డు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, కన్నడ బ్యూటీ రష్మిక నటించిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వ‌ద్ద రూ.900 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. బాలీవుడ్ పరిశ్రమలోనే కాకుండా రణబీర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా, ఈ సినిమా మరో అరుదైన రికార్డును సృష్టించింది.

ALSO READ: ‘మిస్టర్ బచ్చన్’ ఆధ్వర్యంలో ‘ఈగల్’ సక్సెస్‌ సెలబ్రేషన్స్

తక్కువ సమయంలోనే..

ప్ర‌ముఖ మ్యూజిక్ యాప్ స్పాటిఫైలో యానిమల్ ఆల్బమ్ 500 మిలియన్స్ పైగా స్ట్రీమ్ అయ్యింది. ఇక స్పాటిఫైలో ఇప్పటివరకు తక్కువ సమయంలో 500 మిలియన్స్ చేరిన మూవీగా యానిమల్ రికార్డు సృష్టించింది. ఇందులో అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా, ఈ మూవీకి సంబంధించి యానిమ‌ల్ పార్క్‌ సీక్వెల్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button