తెలుగు
te తెలుగు en English
జాతీయం

Delhi: లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు మరో భారీ షాక్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీవ్ర పరిణామం జరిగింది. మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి చుక్కెదురైంది. ఈ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీని పొడిగించింది. ఏప్రిల్ 1 వరకు, అంటే మరో నాలుగు రోజులు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉండాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఆయనను మళ్లీ ఈడీ ప్రధాన కార్యాలయానికి అధికారులు తరలించారు.

ALSO READ: ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు చేశారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ రోజుతో కస్టడీ ముగుస్తుండటంతో మరో 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. చివరకు 4 రోజులకు కోర్టు అనుమతించింది. ఇదిలా ఉంటే ఈడీ కావాలనేే ఈ కుట్రలో ఇరికిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈడీ, సీబీఐ ఛార్జిషీట్‌లో తన పేరు ఎక్కడా లేని ప్రస్తావించకపోయినా కేంద్ర ప్రభుత్వం కావాలనే తనను ఇందులో ఇరికిస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button