తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP: హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా పరిపూర్ణానంద!

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఆదిలోనే చిక్కులు మొదలవుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. హిందూపురం టిక్కెట్ ఆశించి భంగపడ్డ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీ పీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థికి బరిలోకి దిగేందుకు సిద్ధమైపోయారు. తాను ఏమాత్రం వెనక్కి తగ్గే ఛాన్సే లేదని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు.

ALSO READ: ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

స్వామిజీ ఆశలపై చంద్రబాబు నీళ్లు!

పరిపూర్ణనందా స్వామి హిందూపురం ఎంపీ టిక్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత రెండు, మూడేళ్లుగా హిందూపురం బీజేపీ టిక్కెట్ తనేదనని, ఈ ఎన్నికల్లో కచ్చితంగా ఎంపీగా గెలిచి తీరుతానని చెబుతూ వచ్చారు. అయితే కూటమిలో భాగంగా టీడీపీకి ఈ టికెట్‌ దక్కింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమికి సహకరించే ప్రసక్తే లేదని చంద్రబాబు కావాలనే తనకు టిక్కెట్ రాకుండా చేశారని మండిపడ్డారు.

రెబల్ అభ్యర్థిగా బరిలోకి!

ALSO READ: చంద్రబాబువి మోసపు మాటలు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

అంతేకాదు, చంద్రబాబుపై పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తనకు టిక్కెట్ ఇస్తే తమకు ఎక్కడ మైనారిటీ ఓట్లు పడవనే అనుమానంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయం స్వయంగా చంద్రబాబే కూటమి నేతలతో చెప్పారని ఆయన ఆరోపించారు. టీడీపీ–జనసేన కలిసే తనను మోసం చేశాయని ఆయన మండిపడ్డారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బరిలో ఉంటానని, ఎంపీగా, ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తీరుతానని చెబుతున్నారు. కాగా.. హిందూపూరం పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నేత బీకే పార్థసారథి పోటీ చేయబోతున్నారు. ఇక అసెంబ్లీ బరిలోకి చంద్రబాబు బావమరిది, సినీనటుడు బాలకృష్ణ మరోసారి దిగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button