తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్

Pakka Telugu Rating : 3.5/5
Cast : వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, రుహాణి శర్మ, పరేజ్ పహుజా, సంపత్ రాజ్, అభినవ్ గోమటం, అలీ రేజా
Director : శక్తి ప్రతాప్ సింగ్
Music Director : మిక్కి జే మేయర్
Release Date : 01/03/2024

హీరో వరుణ్ తేజ్ ఎంత కష్టపడిన ఆయన ఖాతాలో సరైన హిట్స్ అనేవి పడటంలేదు. ఎప్పుడో ఒక హిట్ వచ్చిన ఆ గ్రాఫ్ ని అలాగే నిలుపుకోవడంలో వరుణ్ ఫేల్ అవుతున్నాడు. గని, గాండివధారి అర్జున అంటూ ఇలా ప్రయోగాలు చేసిన అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఎఫ్2, ఎఫ్3 లు వసూళ్లు సాధించినా.. ఆ హిట్టు క్రెడిట్ వరుణ్ తేజ్ ఖాతాల్లోకి రాదు. ఫిదా, తొలిప్రేమ వంటి హిట్లు వరుణ్ తేజ్ కి రావడం లేదు. ఇలా తాను చేస్తున్న చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా ప్రయోగాలు మాత్రం ఆపడం లేదు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో వరుణ్ కి జోడిగా మానుషి చిల్లర్ నటిస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? వరుణ్ ఖాతాలో హిట్ పడిందా? లేదా? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం!

కథ:

జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భారతదేశంపై దాడి చేయాలనే ఉద్దేశంలో కథ మొదలవుతుంది. తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో తన ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ అర్జున్ దేవ్ ( వరుణ్ తేజ్) తన టీమ్ కి లీడర్ గా వ్యవహరిస్తుంటారు. ఆహన( మానుషి చిల్లర్) ర్యాడర్ ఉన్నతాధికారిగా పనిచేస్తుంటుంది. వీరిద్దరి క్లోజ్ ప్రెండ్ కబీర్( నవదీప్). అయితే కబీర్, అర్జున్ దేవ్ కలిసి సరిహద్దుల్లో శత్రుదేశానికి ర్యాడర్ లో కనిపించకుండా ఉండి వారి ప్లైట్స్ ని కూల్చవచ్చనే ఉపాయంతో ప్రాజెక్ట్ వజ్రా ని సక్సెస్ చేయాలనుకుంటారు. కానీ ఆ ప్రయోగంలో కబీర్ చనిపోతాడు. అది అర్జున్ దేవ్ కెరీయర్ లో ఓ మాయని మచ్చగా నిలిచిపోతుంది. అయితే 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు శ్రీనగర్ లోని గ్వాలియర్ వద్ద ఇండియన్ ఆర్మీ వాహనాలపై ఆత్మహుతి దాడికి పాల్పడతారు. అందులో 40 మంది భారత జవాన్ లు వీరమరణం పొందుతారు. వీళ్ల మరణానికి భారతదేశం ఎలా ప్రతీకారం తీర్చుకుంది? ఇందులో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కు ఎదురైన సవాళ్లని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? ఆపరేషన్ వాలంటైన్ అని పేరు ఎందుకు పెట్టారు? మరోవైపు పాకిస్థాన్ కూడా భారతదేశంపై ఆపరేషన్ నెహ్రూ పేరుతో దాడి చేయాలని ప్లాన్ చేస్తుంది. మరి వారి ఆలోచన ఫలించిందా? అని తెలుసుకోవాలంటే “ఆపరేషన్ వాలెంటైన్” చూడాల్సిందే!

కథనం-విశ్లేషణ:

ఇంతవరకు టాలీవుడ్ లో ఇండియన్ ఆర్మీ గురించి వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గురించి వచ్చిన చిత్రం మాత్రం ఇదే మొదటిది. ఈ సినిమా మొత్తం నిజానికి యథార్థ సంఘటనల ఆధారంగా తీసినట్లున్నారు. కానీ చిత్రబ‌ృందం మాత్రం ఎప్పుడు ఈ విషయాన్ని చెప్పలేదు. ఈ మూవీ చూస్తున్నంతా సేపు మనకు తెలియకుండా మన దేశంలో ఇంతా కథ జరిగిందా అనిపిస్తుంది. భారతదేశం కోసం ఎయిర్ ఫోర్స్ లో వాళ్లు పడిన కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. హీరో, హీరోయిన్స్ లవ్ స్టోరీని ఎక్కువగా సాగదీయకుండా కథపైనే దర్శకుడు ద‌ృష్టి పెట్టిన విధం బాగుంది. తన తోటి పైలట్ ను కాపాడుకోవడానికి హీరో ఎంతటివరకైనా తెగిస్తాడని చాలా చక్కగా హీరో గురించి మొదటి సన్నివేశంలోనే చూపించాడు. ఫ్లైట్స్ ని పరిక్షించడంలో భాగంగా ఒక టార్గెట్ ని పెట్టుకొని దానిని పేల్చివేసే సీన్ హైలెట్ గా ఉంది. పుల్వామా దాడి జరిగిన తీరును చాలా చక్కగా చూపించారు. ఓ పాపను రక్షించడానికి ఒక జవాన్ తన ప్రాణాలను కోల్పోవడం, బస్సులో ప్రయాణిస్తున్న జవాన్ లపై ఎటాక్ చేయడంతో వాళ్లకు ఏం జరుగుతుందో తెలిసేలోపే వారు ప్రాణాలను కోల్పోవడం వంటి సీన్స్ బాధను కలిగిస్తాయి. ఎంటర్వెల్ సీన్ తో సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది.

గ్వాలియర్ దాడి ప్రతీకారంగా అనుకోని రీతిలో పాకిస్తాన్ ను పెద్దతీయడం సినిమాకు హైలెట్ గా నిలిచింది. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్, భారత్ పై దాడి చేయాలనుకోవడం అందుకు పాక్ ఎలాంటి ప్రయత్నాలు చేసిందో బాగా చూపించారు. క్లైమాక్స్ లోని సీన్స్ చూస్తే రోమాలు నిక్కబోడుచుకుంటాయి. ఈ మూవీకి విజువల్స్,గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి.గూస్ బంప్స్ తెప్పించే ఎన్నో సీన్లు ఈ మూవీలో ఉన్నాయి.టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చేలా ఈ చిత్రం ఉంది. ఎయిర్ ఫోర్స్ అసమానమైన ధైర్య సాహసాల్ని దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో చూపించారు. కానీ నవదీప్ మరణం కొంచెం క్లారిటీ గా చూపిస్తే బాగుండు అనిపించింది. పస్టాప్ లో కొన్ని సన్నివేశాలలో గతం ఏది ప్రస్తుతం ఏది అని తెలుసుకోవడంలో ప్రేక్షకులు తికమక పడుతారు. మొత్తం మీద సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించిన మరి మన వాళ్లు ఈ సినిమాను ఎలా రిసివ్ చేసుకుంటారో చూడాలి!

నటీ-నటులు:

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లోని పైలట్ పాత్ర లో చాలా చక్కగా వరుణ్ తేజ్ ఒదిగిపోయారు. తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేశారు. తన దేశం కోసం ఎంతకైనా తెగించే వాడిగా, అలాగే తనను నమ్ముకున్న వాళ్ల కోసం ప్రాణాలను కూడా ఆర్పించడానికి వెనుకడని వాడిలా చాలా బాగా నటించారు. అలాగే హీరోయిన్ గా చేసిన మానిషి చిల్లర్ కు ఇది మొదటి సినిమా అయిన మంచి క్యారెక్టరే లభించింది. పాత్రకు ప్రధాన్యత ఉన్న క్యారెక్టర్ ను ఎంచుకుంది. దానికి తగ్గట్లే తన పాత్రకు న్యాయం చేసింది. ఉన్నతాధికారి పాత్రను, అలాగే తన ప్రేమికుడి ఎక్కడ కోల్పోతానోననే బాధతో ఆమె కనబరిచిన నటన బాగుంది. మిగిలిన నవదీప్, రుహాణి శర్మ, పరేజ్ పహుజా, సంపత్ రాజ్, అభినవ్ గోమటం, అలీ రేజా వారివారి పాత్రల మేరకు నటించారు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తన మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ మధ్య వచ్చే కొత్త దర్శకులు తక్కువ ఖర్చుతో క్వాలిటీగా సినిమాను ఎలా తెరకెక్కించవచ్చో చూపిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను 75 రోజుల్లో పూర్తిచేశారని చెప్పారు. 75 రోజుల్లో ఇంత మంచిగా మూవీని తెరకెక్కించడం గొప్ప విషయమనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత శక్తి ప్రతాప్ కి పెద్ద హీరోల డేట్స్ దొరకడం అంత కష్టామేమి కదానే చెప్పచ్చు. ఈ సినిమాను సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సిద్దు ముద్ద నిర్మించారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. డబ్బు విషయంలో ఎక్కడ రాజీపడినట్లు కనిపించలేదు.మిక్కి జే మేయర్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకు ఫ్లేస్ పాయింట్ అయింది.సినిమాటోగ్రఫి హరి కె వేదాంతం, ఎడిటర్ నవీన్ పనితనం బాగుంది.

ప్లస్ పాయింట్స్:

వరుణ్ తేజ్

గ్రాఫిక్స్, విజువల్స్

యాక్షన్ సీన్స్

నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్:

పస్టాఫ్ లో కొంచెం కన్ఫ్యూజన్

పంచ్‌లైన్: ఆపరేషన్ వాలంటైన్… మిషన్ సక్సెస్ పుల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button