తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM Jagan: నేడు ‘జగనన్న విద్యాదీవెన’ నిధులు విడుదల

పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ‘జగనన్న విద్యా దీవెన’. ఈ పథకానికి సంబంధించి 2023, అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి గానూ మొత్తం 9.44 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో రూ.708.68 కోట్లను జమ చేయనున్నారు. కృష్ణాజిల్లా పామర్రులో జరగనున్న ఈ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదును జమ చేయనున్నారు.

ALSO READ: చంద్రబాబు వద్ద ఊడిగం చేస్తున్నావ్… పవన్ పై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

ఈ పథకంలో భాగంగా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం రెండు విడతల్లో నగదును అందిస్తోంది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.72,919 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఈ పథకాన్ని వర్తింపచేయడం గమనార్హం. మరోవైపు వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని సైతం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

2 Comments

  1. I have read your article carefully and I agree with you very much. This has provided a great help for my thesis writing, and I will seriously improve it. However, I don’t know much about a certain place. Can you help me?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button