తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: తొలి అడుగులోనే అసమ్మతి.. టీడీపీ, జనసేన శ్రేణుల్లో నైరాశ్యం

టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో నిర్వహించిన తొలి సభకు జనం రావడం లేదు. టీడీపీ కార్యకర్తలు, జనసైనికులు నానా తంటాలుపడి బలవంతంగా తరలించినా… చివరి వరకు ఉండటం లేదు. పసలేని ప్రసంగాలు… అదేపనిగా రాగాలు తీస్తూ జగన్‌పై నిందారోపణలు… జనాన్ని ఆకర్షించని నిర్ణయాలు… సభలను నీరుగార్చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ సాయం తీసుకున్నప్పటికీ ప్రజల నుంచి స్పందన రావడం లేదు. సీట్ల సర్దుబాటు విషయంలో అసమ్మతి నెలకొనడంతో సభలకు వెళ్లేందుకు జనసేన నేతలు కూడా సుముఖత చూపడం లేదని తెలుస్తోంది.

ALSO READ: నేడు ‘జగనన్న విద్యాదీవెన’ నిధులు విడుదల

బెడిసికొట్టిందా!

టీడీపీ, జనసేన పొత్తుల వ్యవహారం తొలి అడుగులోనే బెడిసికొట్టిందనే వార్తలు వస్తున్నాయి. పొత్తులు కుదిరిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ‘జెండా సభ’ జనం లేక వెలవెలబోయింది. ఈ సభకు కేవలం 40 వేల నుంచి 50 వేల మంది లోపే హాజరైనట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు టీడీపీ నిర్వహించిన సభలు విఫలమ కావడంతోపాటు జనసేనతో కలిసి ఏర్పాటు చేసిన సభ కూడా అట్టర్ ప్లాప్ కావడంతో టీడీపీ, జనసేన శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.

ALSO READ: ప్రధాని మోదీని కలిసిన బిల్ గేట్స్… పలు అంశాలపై చర్చ!

నమ్మడం లేదా?

జనసేన పార్టీకి 24 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లు ఇచ్చి పవన్‌తో యుద్ధం చేయించాలని అనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం బెడిసి కొట్టింది. కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే గోదావరి జిల్లాల్లో సభను నిర్వహించి బలం చాటుకోవాలని భావించారు. కానీ ప్రజలు పొత్తును నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో ఏ పేరుతో కార్యక్రమం నిర్వహించినా ఉపయోగం లేకుండా పోతోంది. మరోవైపు జనం తనను నమ్మడం లేదని చంద్రబాబు కూడా గుర్తించారు. అందుకే జనసేనతో కలిసి వారిని నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నా.. అది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

8 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button