తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: ఎన్నికల వేళ జన సునామీ.. ఊరూరా పూలవర్షం!

వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లాలో మం­డుటెండలోనూ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారిపొడవునా జై జగన్‌ నినాదాలతో యాత్ర మార్మోగుతోంది. మార్గం మధ్యలో అక్కడక్కడా బస్సును నిలుపుతూ అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలతో ఆప్యాయంగా మాట్లాడుతూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. అనంతరం కొనకనమిట్ల జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలోనూ తమ అభిమాన నేతను చూసేందుకు జన సంద్రం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ సభలో చంద్రబాబు చేసిన మోసాలపై విరుచుకుపడ్డారు.

ALSO READ: అందరికీ మంచి చేశా.. ఇలా చంద్రబాబు చెప్పగలడా?.. సీఎం జగన్

సంక్షేమ పథకాలు అందుతున్నాయా?

చంద్రబాబు అడ్డదారిలో ఎదిగారని, విలువలు ఉండవని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు అంటేనే అందరికీ గుర్తొచ్చేది వెన్నుపోటు అన్నారు. దగా.. మోసం.. అబద్ధాలు.. కుట్రలు.. ఇవే బాబు మార్కు రాజకీయాలు అంటూ విమర్శలు గుప్పించారు. కనీసం ‘రైతు రుణ మాఫీ చేశాడా? మహిళలకు మేలు చేశాడు? అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ఒక్కటైనా అమలు చేశాడా? లేదా? అని ప్రశ్నించారు. వలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నారు. అందుకే చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించాడని.. అవ్వాతాతలకు వితంతు అక్క, చెల్లెలకు, పేదవారికి ఫించన్లు ఇంటికి పోకుండా అడ్డుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ: పదో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. కొనకనమెట్లలో బహిరంగ సభ

జగన్‌ రోడ్‌ షో..

మహిళలు పెద్ద ఎత్తున సీఎం జగన్‌ రోడ్‌ షోకు హాజరయ్యారు. మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. చిన్నా­రులు, విద్యార్థులతో షేక్‌ హ్యాండ్స్, సెల్ఫీలు, ఆత్మీయ పలకరింపులతో సీఎం జగన్‌ ముందుకు సా­గారు. 2.30 గంటలకు నందెలమరెళ్లకి చేరు­కు­న్న సీఎంకు ప్రజలు స్వాగతం పలికారు. చింతలపాలెం ఎస్సీ కాలనీ వద్ద చిన్నారుల తల్లిదండ్రులు పరిగెత్తుకుని జగన్‌ దగ్గరకు వెళ్లగా.. అందరినీ దగ్గరకు తీసుకొని ఆప్యా­యతను చాటారు. సాయంత్రం 6.30 గంటల తర్వాత బహిరంగ సభ నుంచి బత్తువారి పల్లి, సలకనూతల క్రాస్‌ మీదుగా పొదిలి చేరుకున్నారు. రాజంపల్లి, దర్శి రోడ్‌షో అనంతరం 10.20 గంటలకు వెంకటాచలం పల్లిలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు.

సంబంధిత కథనాలు

Back to top button