తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్సినిమా

Salaar: వ‌న్ మిస్టేక్.. బిగ్ లాస్‌..?

టాలీవుడ్ డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ మూవీ పార్ట్ వ‌న్, ఈ సెప్టెంబ‌ర్ లోనే విడుద‌ల కావాల్సిఉంది. కొన్ని కార‌ణాల వ‌ల్ల, స‌లార్ రిలీజ్ పోస్ట్ పోన్ అవ‌డంతో, రెబ‌ల్ స్టార్ అభిమానులే కాకుండా, జ‌న‌ర‌ల్ ఆడియ‌న్స్ కూడా తీవ్ర నిరాశ చెందారు.

స‌లార్ న‌యా డేట్‌ను మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ పోయినా, దీపావ‌ళికి రిలీజ్ ఖాయ‌మ‌నే టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తుంది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. స‌లార్ మూవీ ముందుగా ప్ర‌క‌టించిన డేట్‌కి విడుద‌ల కాక‌పోవ‌డంతో, ఆ సినిమా నిర్మ‌త‌ల‌కు 150 కోట్లు న‌ష్టం వ‌చ్చింద‌ని స‌మాచారం. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కావ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో 300 కోట్లకు స‌లార్ రైట్స్ కొన్నార‌ట‌.

అయితే ఈ సినిమా రిలీజ్ వెన‌క్కిపోండంతో, ఏపీ, తెలంగాణలో స‌లార్ థియేట్రికల్ రైట్స్ 300 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గాల్సిన పరిస్థితి వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. త‌ప్పు త‌మ వైపే ఉండ‌డంతో, చేసేదేం లేక స‌లార్ మేక‌ర్స్ కూడా డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్‌కి తలొగ్గార‌ని స‌మాచారం. దీంతో ఈ మూవీకి విడుదలకు ముందే 150 కోట్ల నష్టం వచ్చినట్లు సోష‌ల్ మీడియాలో టాక్ న‌డుస్తోంది. ఈ వార్తలో నిజమా, రూమ‌రా అనేది తెలియ‌దు కానీ, ఒక చిన్న మిస్టేక్ కార‌ణంగా, స‌లార్ మేక‌ర్స్‌కు పెద్ద లాస్ వ‌చ్చింద‌ని సినీ వర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button