తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Guntur Kaaram: గుంటూరు కారం ప్రీమేక్ అంట‌.. ఇది నిజ‌మేనా త్రివిక్ర‌మ్‌”జీ”..?

టాలీవుడ్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో గుంటూరు కారం మూవీ.. మ‌రో సినిమాకి కాపీ అంటూ, ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అంత‌కంటే ముఖ్య‌మైన మ్యాట‌ర్ ఏంటంటే, సూప‌ర్ స్టార్ కృష్ణ ఓల్డ్ మూవీకి కాపీ అంటున్నారు కొంద‌రు సినీ జ‌నాలు. ప్ర‌స్తుతానికి ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్ మాత్ర‌మే విడుద‌లైంది. దీంతో టీజర్, ట్రైల‌ర్‌లు రాకుండా, గుంటూరు కారంను కాపీ అన‌డం క‌రెక్ట్ కాదు.. కానీ ఇండస్ట్రీలో మాత్రం గుంటూరు కారం ఫ్రీమేకే అంటున్నారు.

త్రివిక్ర‌మ్ విష‌యానికి వ‌స్తే, ఆయ‌న రీమేక్ సినిమాలు తీయ‌రు కానీ, ప్రీమేక్ మూవీస్ చేస్తార‌నే టాక్ ఇండ‌స్ట్రీలో ఉంది. అందులో నిజం కూడా ఉంద‌నుకోండి., ఎందుకంటే త్రివిక్ర‌మ్ కాపీ క‌బుర్లు చాలానే ఉన్నాయి. ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి య‌ద్ద‌న‌పూడి సులోచ‌న రాణి న‌వ‌ల ఆధారంగా వ‌చ్చిన‌ మీనా అనే మూవీని, అ..ఆ పేరుతో ఫ్రీమేక్ చేసి చివాట్లు తిని, మీడియా సాక్షిగా ప‌రువు పోగొట్టుకున్నారు. సీనియ‌ర్ ఎన్టీఆర్ ఇంటిగుట్టు స్టోరీ లైన్‌తో అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం.. ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ మూవీ కాన్సెప్ట్‌తో అజ్ఞాతవాసి, రాయ‌ల‌సీమ రైట‌ర్ రాసిన మొండికత్తి స్టోరీనియాజ్‌టీజ్‌గా చోరీ చేసి అర‌విద స‌మేత వీర‌రాఘ‌వ‌.. ఇవ‌న్నీ త్రివిక్ర‌మ్ చెక్కిన ఫ్రీమేక్ చిత్రాలు.

అయితే ఇప్పుడు గుంటూరు కారం కూడా కాపీనే అనే టాక్ రావ‌డంతో ఇండ‌స్ట్రీలోనే కాకుండా సోష‌ల్ మీడియాలో కూడా జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఫిల్మ్ న‌గ‌ర్‌లో వినిపిస్తున్న టాక్ ప్ర‌కారం.. కృష్ణ గారి మూవీ కృష్ణావ‌తారం సినిమాకు ఫ్రీమేక్ అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అందులో ఓ ఇంటి సమస్యను తీర్చేందుకు వచ్చిన కృష్ణ మీద.. శీదేవి, విజయశాంతి ఇద్ద‌రూ మనసు పారేసుకుంటారు. విజ‌య‌శాంతి కోసం శ్రీదేవి త్యాగం చేసేందుకు సిద్ధ‌మవుతోంది. ఇప్పుడు గుంటూరు కారంలో సేమ్ థీమ్, కాక‌పోతే ఇంటి స‌మ‌స్యను మిర్చి యార్డ్ స‌మ‌స్య‌గా మార్చేసి, శ్రీదేవి ప్లేస్‌లో శ్రీలీల, విజయశాంతి ప్లేస్‌లో మీనాక్షి చౌదరిని తీసుకున్నారట. మ‌రి ఈ రూమ‌ర్ నిజ‌మో కాదో తెలియ‌దు కానీ, త్రివిక్ర‌మ్ హిస్ట‌రీ తెలిసిన వాళ్ళు మాత్రం, గురూజీ కాపీ క‌థ‌తోనే గుంటూరు కారం చిత్రాన్ని తెర‌కెక్కించినా.. ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button