![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/06/after-delhi-canopy-collapses-at-rajkot-airport-terminal-amid-heavy-rains_0hcwoyN1QO-780x470.jpg)
Airport Accidents: మొన్న ఢిల్లీ, నిన్న రాజ్‌కోట్ ఎయిర్ పోర్టులో కూలిన టెర్మినల్!
గుజరాత్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు కారణంగా రాజ్‌కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లోని ప్యాసింజర్స్ పికప్ అండ్ డ్రాప్ షెడ్ కు ఉన్న పరదా గాలివానకు చినిగిపోయి కిందపడిపోయింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ఇది జరగడానికి ఒక్కరోజు ముందే శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇంధిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో టెర్నినల్ 1 దగ్గర షెడ్ కూలిపోయింది. దీంతో ఓ క్యాబ్ డ్రైవర్ మృతి చెందాడు. అంతేకాదు ఐదుగురు గాయపడ్డారు.
ALSO READ: నేడే టీ – 20 వరల్డ్ కప్ ఫైనల్.. భారత్ మళ్లీ కప్పు కొట్టేనా?
ఢిల్లీ విమానాశ్రమంలోని టెర్మినల్ ఒకటి రూఫ్ కుప్పకూలిన ఘటనతో.. ఎయిర్ పోర్ట్ అధారిటీ స్పందించింది. టెర్మినల్ ఒకటి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. టెర్మినల్ వన్ నుంచి విమాన రాకపోకలను రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు టెర్మినల్ ఒకటి మూసివేస్తున్నట్లు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రకటించింది. ఈ ఘటనలో మృతి చెందిన వారికి రూ.20 లక్షలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కాగా.. విమానాశ్రయాల్లో వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.