తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Actor Vijayakanth: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సూపర్ స్టార్ కన్నుమూత

తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళ సూపర్ స్టార్, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయకాంత్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ఇటీవల ఆయనకు కోవిడ్‌ పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతోపాటు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా కూడా లాభం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు.

ALSO READ: మెగాస్టార్ మూవీ నుంచి తప్పుకున్న రానా.. కారణం ఏంటో మరి?

2005లో డీఎండీకే పార్టీ..

మధురైలో 1952 ఆగస్టు 25న జన్మించిన విజయకాంత్‌ అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. 27 ఏళ్ల వయసులో తన పేరు మార్చుకొని ‘ఇనిక్కుం ఇలామై’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. తర్వాత ‘దూరతు ఇడి ముజక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’ వంటి మంచి విజయాలు అందుకున్నారు. విజయకాంత్‌ ఇప్పటివరకు 100కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన 100వ చిత్రం ‘కెప్టెన్‌ ప్రభాకర్‌’ విజయం సాధించిన తర్వాత నుంచి ఆయనను కెప్టెన్‌గా పిలుస్తున్నారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తమిళనాడు రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button