తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Actor Vishal: రాజకీయ ప్రవేశంపై విశాల్ కీలక ప్రకటన.. ఏమన్నారంటే?

తమిళ స్టార్ హీరో విశాల్ రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. హీరో విశాల్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం వస్తోంది. దీంతోపాటు రెండు రోజులుగా హీరో విశాల్‌ రాజకీయ పార్టీ కూడా పెట్టనున్నట్లు కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. తాజాగా, ఈ వార్తలపై హీరో విశాల్ స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ALSO READ: ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలివే?

కాలం నిర్ణయిస్తే ప్రజల కోసం పోరాడుతా..

తన అభిమాన సంఘాన్ని ‘విశాల్‌ మక్కల్‌ నల ఇయక్కం’(విశాల్‌ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చిన విశాల్ అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జులను నియమించి బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే.. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విశాల్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ‘నాకు గుర్తింపు, హోదా ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో దేవి ఫౌండేషన్ స్థాపించా. ఈ ఫౌండేషన్ ద్వారా కొంతమందిని ఆదుకోవడంతోపాటు మరికొంతమంది విద్యార్థులకు చదివిస్తున్నా. రైతులకు సాయం చేశా…లాభాలను ఆశించి ఏ పనిచేయను. ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. కాలం నిర్ణయిస్తే, ప్రజల కోసం పోరాడుతా’నని విశాల్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button