తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Allu Arjun: పుష్ప-3 ఉందట.. రివిల్ చేసిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఏ రేంజ్ లో హిట్టయిందో మనందరికీ తెలిసిందే. తెలుగులో కంటే హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో పుష్ప మూవీ దుమ్ము దులిపేసింది. పుష్ప సినిమా సంచలన విజయం నమోదు చేయడంతో పుష్ప- 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పుష్-2 షూటింగ్ పనుల మీద బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.

Also read: Devara: దేవర మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ టీం

పుష్ప- 2 సినిమా ఆగస్టు 15 రాబోతుందని ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. అయితే కొన్ని రోజులుగా పుష్ప- 3 సినిమా కూడా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై అల్లు అర్జున్ స్పందించాడు. అల్లు అర్జున్ ఇటీవల బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ ఫిలిం ఫెస్టివల్ లో పుష్ప సినిమాని ప్రదర్శించారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్ప- 3 కూడా ఉండొచ్చు. మేము పుష్పని ఒక ఫ్రాంచైజ్ లా తీసుకెళ్లాలని కూడా అనుకుంటున్నామని తెలిపాడు.

రెండో భాగం విడుదలయ్యాక పార్ట్‌-3 గురించి ప్రకటన రావచ్చని సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు. కానీ అల్లు అర్జున్‌ ఇప్పటకే త్రివిక్రమ్‌, సందీప్‌ రెడ్డి వంగా డైరెక్టర్లతో సినిమాను ఒప్పుకున్నారు. బోయపాటి శ్రీనుతో కూడా ఒక ప్రాజెక్ట్‌ చేయనున్నారని టాక్‌ ఉంది. ఇలాంటి సమయంలో పుష్ప-3 రావడం అంత సులభం కాదని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button