తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Glimpse: ఎవడికోసం తగ్గాలి?.. ఎందుకు తగ్గాలి?…’బచ్చల మల్లి’ గ్లింప్స్ రిలీజ్

బచ్చల మల్లి.. అల్లరి నరేష్ హీరోగా వస్తున్న కొత్త సినిమా. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుట్ట నిర్మిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు సుబ్బు మంగాదేవి తెరకెక్కిస్తున్నారు. హనుమాన్ మూవీ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుండి గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు .

జూన్ 30న అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ వీడియో సరికొత్తగా ఉంది. ఊర మాస్ లుక్ లో అల్లరి నరేష్ కనిపిస్తున్నారు. ఇక ఎవరికోసం తగ్గాలి?.. ఎందుకు తగ్గాలి? అని హీరో చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచింది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆడియన్స్ నుంచి కూడా క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే అల్లరి నరేష్ నటించిన రెండు సినిమాలు ఈ సంవత్సరం విడుదల అయ్యాయి. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘నా సామిరంగా’ సినిమాలో అల్లరి నరేష్ కీలకపాత్ర పోషించగా… ‘ఆ ఒక్కటి అడక్కు’ అంటూ నరేష్ హీరోగా మరో సినిమా ప్రేక్షకుల ముందు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మరోసారి ప్రేక్షకుల ముందుకు బచ్చల మల్లిగా నరేష్ మాస్ లుక్కుతో రానున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button