తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Devara: అభిమానులకు ఎన్టీఆర్ గుడ్ న్యూస్.. ‘దేవర‘ గ్లింప్స్ పై కీలక ప్రకటన

కొత్త సంవత్సరం నాడు అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాంచి కిక్కిచ్చే వార్తను పంచుకున్నాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర గ్లింప్స్ ను ఈనెల 8వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించాడు. ఈ సందర్భంగా అభిమానులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు.

Also Read టిల్లుతో రెచ్చిపోయిన అనుపమ.. హాట్ ఫోజుతో పోస్టర్ విడుదల

ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చేస్తుండడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి అప్డేట్లు లేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాతలు, దర్శకులకు ‘అప్డేట్ ప్లీజ్’ అని మెసేజ్ లు పంపుతున్నారు. ఇక కల్యాణ్ రామ్ కు కూడా దేవర ప్రభావం తగిలింది. తన డెవిల్ సినిమా కన్నా దేవర అప్డేట్ లు అడుగుతున్నారని కల్యాణ్ రామ్ వాపోయిన పరిస్థితులు ఉన్నాయి.

Also Read కేటీఆర్ ఆసక్తికర ట్వీట్… ఇది నిజమో? కాదో? మీరే చెప్పండి!

భారీ యాక్షన్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్, కీలక పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించనుండడం మరో ప్రత్యేకత. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరి కోసరాజు, సుధాకర్ మిక్కిలినేనితో కలిసి కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button