తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Kajal: పవర్ ఫుల్ పాత్రలో కాజల్.. సత్యభామ టీజర్ రిలీజ్

సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ. దర్శకుడు సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్నఈ క్రైమ్ ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఇక మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

టీజర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అలరించిన కాజల్ మొదటిసారిగా పోలీసుపాత్రలో ఆడియన్స్ ను అలరించనున్నారు. అంతేకాదు.. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అదరగొట్టేశారు. సస్పెన్స్, ఇన్వెస్టిగేటీవ్ నేపథ్యంలో వచ్చే సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తంగా ఈ టీజర్ సత్యభామ సినిమాపై అంచనాలు పెంచేసింది. మేజర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శశికిరణ్ తిక్క ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తూ.. స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. ఇక ఈ టీజర్ కు శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాగ్రౌంగ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button