తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Mahesh Babu: జిమ్‌లో సూపర్​స్టార్ ప్రిన్స్ కసరత్తు.. ఫొటోలు వైరల్

సూపర్​స్టార్ మహేశ్​బాబు ఫిట్​నెస్​ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 47 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల యువకుడిలా ఫిట్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తుంటారు. ఇక ఫిట్​నెస్​కు సంబంధించిన సీక్రెట్​ ఏంటో చెప్పమంటూ మహేశ్​ను పలు ఇంటర్వ్యూల్లోనే చాలా మంది అడుగుతుంటారు. తాజాగా జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న స్టిల్స్‌ను షేర్ చేశాడు. సోషల్ మీడియాలో టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే మహేశ్‌ బాబు మరోసారి మేకోవర్‌ను సెట్‌ చేసుకునే బిజీగా మారిపోయారు. అయితే జిమ్‌లో మహేశ్‌బాబుతోపాటు పెట్‌ కూడా కనిపిస్తోంది.

ALSO READ: ఫ్యామిలీ స్టార్ రిలీజ్ లీక్ చేసిన దిల్ రాజు.. ఎప్పుడంటే?

సంక్రాంతి కానుకగా ‘గుంటూరు కారం’

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి ఎస్‌ థమన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button