![](https://pakkatelugu.com/wp-content/uploads/2023/11/pawan-2-780x470.jpg)
Pawan Kalyan: రాజకీయాలపై పవన్ దృష్టి.. సినిమాలు ఇక లేనట్టేనా!
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ బిజిబిజీగా గడుపుతున్నాడు. అటు రాజకీయాలు, ఇటు సినిమాలను ఒకే కాలంలో చేస్తున్నాడు. అందుకు వీలైన కథలనే ఎంచుకుంటున్నాడు. జనసేన పార్టీ ప్రకటించిన తర్వాత సినిమాలు చేయనని ప్రకటించిన ఆయన.. 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ ఫండింగ్ కోసం అంటూ మళ్లీ సినిమాల బాట పట్టాడు.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు పవన్ చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలకు షూటింగ్ స్టేజీలో ఉన్నాయి. అయితే నిర్మాతల నుంచి ముందే డబ్బు తీసుకున్న పవన్.. అడపాదడపా షూటింగ్ లకు వస్తున్నారు. హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభించి రెండేళ్లు దాటింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మాత్రం ఏదో కొద్దిగా షూటింగ్ పూర్తైంది. ఇక ఓజీ సినిమా దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇక ఎన్నికల హడావిడి మొదలుకావడంతో పవన్ తన దృష్టి మొత్తం రాజకీయాలపై పెట్టాడు. దీంతో సినిమా షూటింగ్ లను ఆపేశాడు. దీంతో ఆ మూవీ మేకర్స్ పవన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నికల తర్వాతే పవన్ సినిమాలకు రానున్నట్టు సమాచారం.