తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Prashanth Varma: ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ అధీర అప్డేట్… హీరో ఎవరంటే?

ప్రశాంత్ వర్మ.. ఇప్పుడిది పేరు కాదు ఒక బ్రాండ్. తీసింది నాలుగు సినిమాలు మాత్రమే. కానీ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు. ఇటీవల ఈయన డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ మూవీ సూపర్ హిట్ అందుకుంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో హనుమంతుని బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 13 రోజుల్లోనే ఏకంగా రూ.230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Also read: Ratnam: విశాల్ రత్నం మూవీ అప్డేట్.. త్వరలోనే సినిమా రిలీజ్

దీంతో ప్రశాంత్ వర్మ నుండి వస్తున్న నెక్స్ట్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు.. హనుమాన్ తరువాత ప్రశాంత్ ఎలాంటి సినిమా చేస్తున్నాడు? మళ్ళీ సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే వస్తున్నాడా? అలా అయితే ఈసారి వస్తున్న సూపర్ హీరో ఎవరు? ఆ సినిమాలో హీరోగా ఎవరు చేస్తున్నారు? అంటూ తెగ సర్చింగ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. ప్రశాంత్ వర్మ తరువాత సినిమాను కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే తీయబోతున్నారట. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చింది. ఇంట్రో వీడియో కూడా రిలీజైంది. ఆ సినిమానే అధీర. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతున్నారు.

అధీర సినిమా కోసం లైట్ ను సూపర్ హీరో పవర్ గా తీసుకోనున్నారు ప్రశాంత్ వర్మ. తనకున్న లైటింగ్ పవర్ తో ఆ సూపర్ హీరో ఎం చేశాడు అనేది అధీర కథ. ఈ సినిమాకు సంబందించి షూటింగ్ ఇప్పటికే మొదలైందని ప్రశాంత్ చెప్పారు. ఇక అధీరకి సంబంధించిన ఇంట్రో వీడియో చేశాక.. ఈ సినిమా కూడా హనుమాన్ రేంజ్ లో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా 2024 ఇయర్ ఎండింగ్ లో వచ్చే అవకాశం ఉంది. మరి మాములు బడ్జెట్ తోనే హనుమాన్ లాంటి గొప్ప సినిమా తీసిన ప్రశాంత్.. ఇప్పుడు ఏ రేంజ్ సినిమా తీస్తాడో అని ఆడియన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button