![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/game-changer.jpg)
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ మళ్లీ వాయిదా?
రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై ఎన్నో రోజులు గడిచాయి. కానీ ఇప్పటికి సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇక ఈ సినిమా ఆలస్యం కావడంతో ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు.. రామచరణ్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ పై మరో వార్త వైరల్ అవుతోంది.
Also read: Allu Arjun: పుష్ప-3 ఉందట.. రివిల్ చేసిన అల్లు అర్జున్
ఈ సినిమా షూటింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదని అందరికీ తెలిసిందే. డైరెక్టర్ శంకర్ ఈ సినిమా కన్నా ముందు ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారని సమాచారం. దాంతో చరణ్ మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉందట. ఈ ఏడాది డిసెంబర్ లేదా 2025 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చని అంటున్నారు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
అయితే ఎన్టీఆర్ దేవర మొదట ఏప్రిల్ 5న రిలీజ్ ప్రకటించిన టీం మళ్లీ డేట్ మార్చి అక్టోబర్ 10 కి విడుదల చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత నాగార్జున, వెంకటేష్, చిరంజీవి సినిమాలు కూడా వరుసగా లైన్ లో ఉండంతో సినిమా విడుదల తేదీ వాయిదా పడబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరగా షూటింగ్ పూర్తిచేసుకుని డిసెంబర్ 2024 కి కంప్లీట్ చేయాలని మూవీ టీం ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై రెండు నెలల క్రితం శంకర్, రామ్ చరణ్, దిల్ రాజు మీటింగ్ అయ్యారని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్‌కి మరో 4,5 నెలల సమయం పడుతుంది కనుక.. 2024 డిసెంబర్లో విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.