తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Sohel: ‘బూట్‌ కట్ బాలరాజు’ మూవీ అప్‌డేట్.. వీడియో సాంగ్ రిలీజ్

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్‌‌బాస్’ ఫేమ్ సోహెల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బూట్‌ కట్ బాలరాజు’. ఈ సినిమాకు శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తుండగా.. ఎం.డీ పాషా నిర్మిస్తున్నారు. ఇందులో మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం నుంచి విడుదలైన ‘రాజు నా బాలరాజు పాట’ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, మేకర్స్ రింగు..రింగు బిల్లా అనే మరో పాట విడుదల చేశారు.

ఎనర్జిటిక్‌గా సోహెల్..

ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటని తనదైన శైలిలో మ్యూజిక్ అందించగా, భోలే షావలి, రఘురాం పాడారు. ఈ పాటలో హీరో చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. కాగా, ఈ వీడియో సాంగ్ చూస్తే విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో స్టోరీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాగే ఈ మూవీకి విజయ్ వర్ధన్ ఎడిటర్ కాగా, విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు ముగింపు దశలో ఉన్నాయని.. త్వరలో త్వరలో ఈ మూవీ అప్ డేట్స్ ఇవ్వనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button