తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Yatra 2: యాత్ర-2′ నుంచి ‘తొలి సమరం’ సాంగ్‌ విడుదల

యాత్ర -2 ఫిబ్రవరి 8న విడుదల కానున్నడంతో అభిమానులకు చిత్ర యూనిట్‌ మరో కానుక అందించింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌ తెలుగు ప్రేక్షకుల గుండెలను తాకింది. కొద్దిరోజుల ముందు ‘చూడు నాన్న’ అనే వీడియో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఆ పాట కూడా ప్రేక్షకులను మెప్పించింది.

Also Read:  గుంటూరు కారం ఓటీటీ వర్షన్ లో మార్పులు.. అదనంగా కొన్ని సీన్లు?

తాజాగా ‘తొలి సమరం’ అనే సాంగ్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సాంగ్‌లో అంటూ సాగే వీడియో సాంగ్ వైఎస్ జగన్ (జీవా) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, పార్టీ తరపున ఎన్నికల శంఖారావం పూరించడం, ప్రచారంలో పార్టీ గుర్తు ఫ్యాన్ ని ప్రదర్శించడం వంటి దృశ్యాలు ఉన్నాయి. ఈ పాటలో ఆయన పలికించిన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విజువల్స్ కూడా అద్బుతంగా ఉన్నాయి. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను గౌతమ్‌ భరధ్వాజ్‌ ఆలపించారు.

Also Read: హనీరోజ్ కి సూపర్ ఆఫర్.. పెద్ద సినిమాలో కీలక రోల్?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర-2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘యాత్ర 2’ ఉంటుంది.

Also Read: శ్రీమంతుడు మూవీ కాపీరైట్స్.. కొరటాల శివకు సుప్రీంకోర్టు ఝలక్

ఇందులో వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నాడు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో ఉత్తరాది నటుడు, మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ పార్టీ కీలక నేత సోనియా గాంధీ పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ కనిపించనున్నారు. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button