తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: చంద్రబాబు vs జగన్ … ఎవరి హయాంలో రోడ్ల నిర్మాణానికి పెద్దపీట

రోడ్ల విషయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, ఇతర విపక్షాలు అవకాశం దొరికిన ప్రతిసారి రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవని ఆరోపిస్తున్నాయి. సోషల్ మీడియాలోను ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి పై తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. వీటన్నింటికి చెక్ పెడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు హయాంలో… ప్రస్తుత సీఎం జగన్ పాలనలో రోడ్ల కోసం ఎవరు ఎంత ఖర్చు చేశారనే వాటి గురించి వివరంగా ఉంది.

Also Read:  తెలంగాణలో మొదలైన ప్రజాపాలన.. వసూళ్లకు తెరలేపిన దళారులు

రోడ్ల మరమ్మతులకు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రూ.2,954 కోట్లు వెచ్చిస్తే అదే వైఎస్ఆర్సీపీ నాలుగేళ్ల పాలనలో రూ.4,149 కోట్లు ఖర్చుచేశారు. రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి ఐదేళ్లలో చంద్రబాబు రూ.4,325 కోట్లు, జగన్ నాలుగేళ్లలో రూ.7,340 కోట్లు వెచ్చినట్లు తెలుస్తుంది. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి చంద్రబాబు రూ.3,160 కోట్లు ఖర్చు చేస్తే జగన్ నాలుగేళ్లలో రూ.5,444 కోట్లు వినియోగించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి ఐదేళ్లల్లో రూ.14,353 కోట్లు అయితే నాలుగేళ్లల్లో రూ.25,304 కోట్లు వెచ్చించారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణకు చేసిన మొత్తం ఖర్చు చంద్రబాబు రూ.24,792 కోట్లు కాగ జగన్ రూ.42,236 కోట్లు ఖర్చుచేసినట్లు తెలుస్తుంది. రోడ్ల నిర్మాణం, నిర్వహణకు చేసిన సరాసరి ఖర్చు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రూ.4,958 కోట్లు, జగన్ నాలుగేళ్ల పాలనలో రూ.10,559 కోట్లు ఖర్చు చేశారు. ఈ లెక్కలను బట్టి చూస్తే చంద్రబాబు కంటే జగన్ రెండు రెట్లు రోడ్ల కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.

Also Read: వ్యూహాత్మక ప్రణాళికలు.. ‘అనంత వైసీపీ’లో పోటీ చేసేది వీళ్లే?

తీరప్రాంత జిల్లాల్లో రూ.768 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులతో 2,294 కి. మీ.మేర రోడ్లను… తీరప్రాంతం లేని జిల్లాల్లో రూ.352 కోట్ల ఆర్ఎస్ఐ డీఎఫ్ నిధులతో 1,154 కి.మీ. మేర పునరుద్ధరించనున్నారు. 339 రోడ్లను ‘హై ప్రయారిటీ’ రోడ్లుగా గుర్తించింది. రోడ్ల పునరుద్ధరణకు టీడీపీ 2017–18 లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని కూడా ఎన్నికల ప్రయోజనాల కోసం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించారు. దాంతో 2019 నాటికి రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది.

Also Read: ప్రజాపాలన దరఖాస్తు… ఎలా నింపాలో తెలియజేసే వీడియో ఇదిగోండి!

ఈ లెక్కలను బట్టి చూస్తే జగన్ సర్కాస్ రోడ్ల నిర్మాణానికి పెద్ద పీట వేసినట్లు తెలుస్తుంది. కానీ కొందరు మాత్రం పనికట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితి, ఇబ్బందులను తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం రోడ్లకు సంబంధించే కాకుండా పచ్చదనం, సుదరీకరణ, వీధిలైట్లు, ఫుట్‌పాత్స్, మురుగు కాల్వల పరిస్థితి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి అంశాలను కూడా సమీక్షించేందుకు యాప్‌లో చోటు కల్పించాలని సూచించారు. నిరంతరం పర్యవేక్షించడం వల్ల సమస్యలను సత్వరం పరిష్కరించే వీలుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button